
జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం మువ్వన్నెల జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన ఆనాడు స్వాతంత్ర్యం కోసం పోరాడినవారిని గుర్తు చేసుకొని, వారందరూ తమ ప్రాణాలను, జీవితాలను పణంగా పెట్టి సంపాదించిపెట్టిన ఈ స్వాతంత్రభారతాన్ని అందరూ కలిసిమెలిసి మెలుగుతూ అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. కులాలు, మతాలు, బాషలు, ప్రాంతాల పేరిట ప్రజలను విభజించుకొని పరిపాలించే పద్దతులకు స్వస్తిపలుకవలసిన సమయం వచ్చిందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సమానంగా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. దాని కోసమే గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్లను ఏర్పాటు చేశామని ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.