నేడు బిజెపిలో చేరనున్న జి.వివేక్

మాజీ ఎంపీ జి.వివేక్ ఈరోజు బిజెపిలో చేరానున్నారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో కలిసి ఆయన ఈరోజు డిల్లీ వెళుతున్నారు. అక్కడ బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆయనకు కాషాయకండువా కప్పి బిజెపిలో చేర్చుకోనున్నారు. తెరాసను వీడి బయటకు వచ్చిన తరువాత ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రప్పించాలని సీనియర్ కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నించారు కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్ అగమ్యగోచరంగా ఉండటంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి సీనియర్ కాంగ్రెస్‌ నేతలే పార్టీని వీడి బిజెపిలో చేరేందుకు సిద్దపడుతున్నప్పుడు వివేక్ చేరుతారనుకోవడం అత్యాశే అవుతుంది. తెలంగాణ సచివాలయం కూల్చివేతను అడ్డుకోవాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చే మిషతో జి.వివేక్ కొన్ని రోజుల క్రితమే కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలిశారు. బిజెపిలో చేరేందుకే ఆయన అమిత్ షాను కలిశారని అప్పుడే ఊహాగానాలు వినిపించాయి. వాటిని నిజం చేస్తూ నేడు బిజెపిలో చేరబోతున్నారు.