పాక్‌ నిర్ణయాల వలన భారత్‌ ఎంతగా నష్టపోయిందంటే....

భారత్‌-పాక్‌ మద్య ఉద్రిక్తలు తలెత్తిన ప్రతీసారి భారత్‌ ఏవో కొన్ని ప్రతీకార చర్యలు తీసుకునేది. వాటిలో సర్జికల్ స్ట్రైయిక్స్ వంటి భీభత్సమైన చర్యలు కూడా ఉన్నాయి. ఈసారి పాకిస్థాన్‌ వంతు రావడంతో కొన్ని ప్రతీకార చర్యలు తీసుకొంది. వాటిలో భారత్‌తో వాణిజ్య ఒప్పందాలను, ద్వైపాక్షిక ఒప్పందాలను పునః సమీక్షించడం, ఆగస్ట్ 15న బ్లాక్ డేగా పాటించడం, సంజౌతా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేయడం వంటివి ఉన్నాయి. పాక్‌ ప్రతీకార చర్యలపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్ ట్విట్టర్‌లో చాలా వ్యంగ్యంగా స్పందించారు. 

“ భారత్‌తో అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను పాక్‌ రద్దు చేసుకోవడం వలన భారత్‌ ఆర్ధిక వ్యవస్థకు చాలా నష్టం జరిగింది. ఎంతగా అంటే విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రాంలో ఒక ప్రమోషనల్ పోస్ట్ పెట్టేందుకు తీసుకునే మొత్తం అంత. ఈ నష్టం నుంచి మేము ఏవిధంగా కోలుకోగలమో?” అని ట్వీట్ చేశారు.