
ఉమ్మడి ఖమ్మంజిల్లా పరిధిలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, ములుగు జిల్లాలో కొత్తగా ఎన్నికైన జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కొ ఆప్షన్ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు బుదవారం ప్రమాణస్వీకారాలు చేయడంతో పాలకమండళ్ళు ఏర్పాటయ్యాయి. నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్లలో కూడా ఎంపీపీలు, ఎంపీటీసీలు బుదవారం తొలిసారిగా సమావేశం నిర్వహించారు. ములుగు, మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జెడ్పీలను స్థానిక ఎంపీడీవో కార్యాలయాలలో, ఖమ్మం జెడ్పీని పాత జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. బుదవారం ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన కొత్త పాలక మండలి సభ్యులు అందరి పదవీకాలం 5 ఏళ్ళు ఉంటుంది.