సంబంధిత వార్తలు

కాళేశ్వరం ప్రాజెక్టులో ఎల్లంపల్లి వరకు నీళ్ళు చేరుకోవడంతో సిఎం కేసీఆర్ మంగళవారం ప్రాజెక్టు పరిశీలనకు రానున్నారు. ఈరోజు ఉదయం 9.50 గంటలకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 10.40 గంటలకు మేడిగడ్డ బ్యారేజి వద్దకు చేరుకొని ఆ పరిసర ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. తరువాత సుందిళ్ళ బ్యారేజీ, గోలివాడ పంప్‌హౌస్‌లను సందర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకొంటారు. అక్కడి నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారు.