సంబంధిత వార్తలు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఖాళీ అయిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ ప్రకటించింది. ఏపీలో ముగ్గురు ఎమ్మెల్సీల రాజీనామాలతో మూడు స్థానాలు ఖాళీ అవగా, తెలంగాణలో తెరాస ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డిపై అనర్హత వేటు పడటంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఎన్నికలు షెడ్యూల్ ఈవిధంగా ఉంది. ఎన్నికల నోటిఫికేషన్: ఆగస్ట్ 7, నామినేషన్ల దాఖలుకు చివరి రోజు: ఆగస్ట్ 14, నామినేషన్ల పరిశీలన: ఆగస్ట్ 16, నామినేషన్ల ఉపసంహరణకు గడువు: ఆగస్ట్ 19, పోలింగ్: ఆగస్ట్ 26. ఆదేరోజున ఓట్ల లెక్కించి ఫలితాలు వెల్లడిస్తామని కేంద్రం ఎన్నికల సంఘం తెలిపింది.