.jpg)
తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్ వేదికగా కేసీఆర్ సర్కారుపై విమర్శనస్త్రాలు సందిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ పాతబస్తీలో ఆయుర్వేద విద్యార్ధినీతో ఒక పోలీస్ అసభ్యంగా ప్రవర్తించడంపై సిఎం కేసీఆర్ కానీ మంత్రులుగానీ స్పందించకపోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఇంటర్మీడియెట్ బోర్డు నిర్వాకం, అటవీశాఖ అధికారిని అనితపై తెరాస నేత కృష్ణారావు దాడి చేయడం, ఆయుర్వేద విద్యార్ధినితో ఒక పోలీసు అసభ్యంగా ప్రవర్తించడం ప్రస్తావించి సిఎం కేసీఆర్ వైఖరికి ప్రభుత్వం తీరుకు అద్దం పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా సిఎం కేసీఆర్ పాతబస్తీ సంఘటనకు బాధ్యుడైన పోలీసుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కార్ను ఉద్దేశ్యించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె మాటలలోనే...