ఉపాధ్యాయుల భర్తీ ఇంకా ఎప్పుడు? సుప్రీంకోర్టు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు పంపించింది. ప్రభుత్వ పాఠశాలలలో కనీస సౌకర్యాల కల్పనా, ఉపాధ్యాయుల భర్తీకి సంబందించి గతంలో తాము అడిగిన నివేదికను మూడు రోజులలోగా సమర్పించాలని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. లేకుంటే ప్రభుత్వం ప్రధాన కార్యదర్శులను కోర్టుకు పిలిపించవలసి వస్తుందని హెచ్చరించింది.