సచివాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు

సచివాలయం, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ గురువారం ఉదయం అఖిలపక్ష నేతలు ఇందిరాపార్క్ వద్ద నుంచి ‘ఛలో సచివాలయం ’ పేరుతో సచివాలయం ముట్టడికి సిద్దం అయ్యారు. ముందుగా వారందరూ జి.వివేక్ అధ్వర్యంలో పనిచేస్తున్న ప్రజాస్వామిక తెలంగాణ వేదిక నేతృత్వంలో ఇందిరాపార్క్ వద్ద కాసేపు ధర్నా చేశారు. అనంతరం అక్కడి నుచి సచివాలయానికి బయలుదేరగానే, ముందస్తు జాగ్రత్త చర్యగా పోలీసులు వారిని అరెస్ట్ చేసి జవహార్ నగర్, గోషామహల్ పోలీసు స్టేషన్లకు తరలించారు. కొంతమందిని వారి ఇళ్ల వద్దనే అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్లకు తరలించారు. ‘ఛలో సచివాలయం’ కార్యక్రమంలో జి.వివేక్‌, టిజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్, వామపక్షాల నేతలు పాల్గొన్నారు.