
శంషాబాద్ విమానాశ్రయంలో 150 కేజీల బంగారం పట్టుబడింది. ఈ తరలింపు వ్యవహారంలో కొనుగోలుదారుల తరపున హైదరాబాద్కు చెందిన ఆర్క్ డిజిటల్ అనే సంస్థ మద్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఆ సంస్థ మలేషియా నుంచి 150 కేజీల బంగారాన్ని బిస్కట్ల రూపంలో తీసుకువచ్చింది. మలేసియా నుంచి బారీగా బంగారం వస్తోందని సమాచారం అందుకున్న కస్టమ్స్ అధికారులు ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా తనికీలు చేయగా ఆర్క్ డిజిటల్ సంస్థకు చెందిన లగేజీలో బంగారు బిస్కట్లు పట్టుబడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకొని సంబందిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా ఈ అక్రమ బంగారం తరలింపు వెనుక ఏపీ, తెలంగాణతో సహా పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖుల హస్తం ఉన్నట్లు కనుగొన్నారు.