
ఈ నెల 30 లేదా 31తేదీలలో రాష్ట్రంలోని 3 నగరపాలక సంస్థలకు,131 పురపాలకసంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు మున్సిపల్ శాఖ, ఎన్నికల సంఘం చకచకా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి. ఇప్పటికే వార్డుల విభజన ప్రక్రియ ముగిసింది. ఈనెల 18వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా ఓటర్ల తుది జాబితాలు ప్రకటించడానికి గడువు ఉన్నప్పటికీ 14లోగా ఆ ప్రక్రియ పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. జూలై 10న మహిళా ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటన, 11,12 తేదీలలో దానిపై అభ్యంతరాలు స్వీకరణ,13న వాటి పరిష్కారించి జూలై 14న తుది జాబితా ప్రకటించాలని ఎన్నికల సంఘం ఆదేశించిందికనుక మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదనుగుణంగా ఆ ప్రక్రియను పూర్తిచేయడానికి ప్రయత్నిస్తున్నారు. జూలై 14లోగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ కూడా పూర్తి చేయాలని ఆదేశించింది. కనుక జూలై 15 లేదా 16 తేదీలలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.