
కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంటులో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు.daఏనిలో ముఖ్యాంశాలు:
1. వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిలో మార్పు లేదు. రూ.5 లక్షల వరకు ఆదాయానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
2. మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికి రూ.45లక్షలులోపు గృహరుణాలపై వడ్డీ రాయితీ రూ.2 లక్షల నుంచి రూ.3.50లక్షలకు పెంపు.
3. రూ.5 కోట్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగిన వారిపై సర్‌ఛార్జీ పెంపు.
4. జన్‌ధన్ ఖాతా కలిగిన మహిళలకు రూ.5వేలు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం.
5. స్వయం సహాయక బృందాలకు కూడా ముద్ర యోజన వర్తింపు. ప్రతి స్వయం సహాయక బృందంలో ఒకరికి రూ.లక్ష వరకు ముద్ర రుణం.
6. అపరిచిత నగదు జమ నియంత్రణకు ప్రత్యేక విధానం.
7. బ్యాంకు ఖాతా నుంచి ఏడాదికి రూ.కోటి వరకు ఉపసంహరణకు అనుమతి. అంతకు మించితే 2 శాతం టీడీఎస్.
8. నగదు రహిత చెల్లింపులపై ఎండీఆర్ ఛార్జీలు పూర్తిగా రద్దు.
9. కార్పొరేట్ ట్యాక్స్ పరిధి రూ.400కోట్లకు పెంపు.
10. పాన్ నంబర్ లేకపోయినా ఐటీ రిటర్న్స్ దాఖలుకు అవకాశం. పాన్ లేదా ఆధార్ నంబర్‌తో ఐటీ రిటర్న్స్ దాఖలుకు వెసులుబాటు.
11. డీజిల్, పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రూ.1 పెంపు.
12.బంగారంపై కస్టమ్స్ సుంకం 10 నుంచి 12.50శాతానికి పెంపు
13. భారత పాస్‌పోర్టు కలిగిన ఎన్ఆర్ఐలకు ఆధార్ కార్డులు.
14. స్టాక్మార్కెట్లో ఎన్ఆర్ఐల పెట్టుబడులకు వెసులుబాటు. అవి విదేశీ పోర్టుఫోలియోగా గుర్తింపు
15. విద్యుత్ వాహనాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5శాతానికి తగ్గింపుకు ప్రతిపాదనలు.
16. త్వరలో రూ.1, 2, 5,10, 20 కొత్త నాణేల విడుదల.
17. భారత రాయబార కార్యాలయం లేని దేశాల్లో నూతన రాయబార కార్యాలయాల ఏర్పాటు.
18. ‘జలశక్తి మంత్రిత్వశాఖ’ ఏర్పాటు. అన్ని నీటి వనరుల నిర్వహణ. ‘హర్ ఘర్ జల్’ పథకంలో భాగంగా నివాసాలకు నీటి సరఫరా.
19. నాలుగు కార్మిక న్యాయస్థానాల ఏర్పాటు.
20. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ. లక్షా ఐదు వేల కోట్ల ఉపసంహరణకు నిర్ణయం
21. హైదరాబాద్ ఐఐటికు ఈపీఏ క్రింద రూ.80 కోట్లు కేటాయింపు.
22. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.13కోట్లు.
23. ఇస్రో సేవలను వాణిజ్యపరంగాను వృద్ధి చేసేందుకు ప్రత్యేక కంపెనీ. అంతరిక్ష ప్రయోగాల ఉత్పత్తులు, మార్కెటింగ్‌కు ప్రత్యేక వ్యవస్థ.
24. దేశంలో మెగా మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లు. బ్యాటరీ, సౌరశక్తి రంగంలో విదేశీ కంపెనీలకు అనుమతి
25. 17 పర్యాటక కేంద్రాల్లో ప్రపంచస్థాయి సౌకర్యాల ఏర్పాటు.
26. స్టార్టప్‌ల కోసం దూరదర్శన్‌లో ప్రత్యేకంగా కొత్త ఛానల్. దాని నిర్వహణ బాధ్యత స్టార్టప్‌లకే అప్పగింత.
27. ఇళ్ల నుంచి వచ్చే నీటిని తిరిగి సాగుకు యోగ్యంగా మలిచేందుకు ప్రత్యేక పథకం. 256 జిల్లాల్లో జల్‌శక్తి అభియాన్.