
వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, కంది, పెసర,మునుము రైతులకు శుభవార్త. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో నిన్న డిల్లీలో జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో అన్నదాతలకు ఉపశమనం కల్పిస్తూ 14 రకాల పంటలకు కనీస మద్దతుధరలను పెంచింది. ఈ ధరలు 2019-20 ఖరీఫ్ సీజనుకు వర్తిస్తాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు.
వరి (సాధారణ రకం)పై కనీస మద్దతుధర రూ.65 పెంచింది. దాంతో వరి క్వింటాల్ ధర రూ.1,815 అయ్యింది. వరి (మేలురకం) పై రూ. 65 పెంచడంతో ధాని ధర రూ.1,835 అయ్యింది. వివిద పంటలకు పెంచిన మద్దతు ధరలు ఈవిధంగా ఉన్నాయి.
|
పంట |
గత ఏడాది ధర |
పెంచిన మొత్తం |
తాజా ధర |
|
వరి (సాధారణ రకం) |
1,1750 |
65 |
1,815 |
|
వరి (మేలు రకం) |
1,770 |
65 |
1,835 |
|
జొన్న (హైబ్రీడ్) |
2,430 |
120 |
2,550 |
|
జొన్న (మాల్దండి) |
2,450 |
120 |
2,570 |
|
మొక్కజొన్న |
1,700 |
60 |
1,760 |
|
పత్తి (మధ్యస్థం) |
5,150 |
105 |
5,255 |
|
పత్తి (పొడవు రకం) |
5,450 |
100 |
5,550 |
|
నువ్వులు |
6,429 |
236 |
6,485 |
|
వేరుశనగ |
4,890 |
200 |
5,090 |
|
కందులు |
5675 |
125 |
5,800 |
|
మునుములు |
5,600 |
100 |
5,700 |
|
పెసర |
6,975 |
75 |
7,050 |
|
పొద్దుతిరుగుడు |
5,388 |
262 |
5,650 |
|
రాగులు |
2,897 |
253 |
3,150 |
|
సజ్జలు |
1,950 |
50 |
2,000 |