హైదరాబాద్‌లో కొత్తరకం ట్రాఫిక్ సిగ్నల్స్

హైదరాబాద్‌ పోలీసులు నగరంల్ కొత్తరకం ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ప్రయోగాత్మకంగా అమలుచేసి చూస్తున్నారు. సాధారణంగా సిగ్నల్ లైట్స్ పైన స్తంభాలకు అమర్చి ఉంటాయి. కానీ ఈ కొత్త వ్యవస్థలో సిగ్నల్ లైట్లు నేలపై రోడ్డుకు అడ్డంగా ఆ చివర నుంచి ఈ చివఅమర్చబడి ఉన్నాయి. యధాప్రకారం వాటిలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ కలర్స్ లైట్లు ఉంటాయి. ప్రస్తుతం ఈ కొత్త వ్యవస్థను గరంలో కేబీఆర్ పార్క్ వద్ద ప్రయోగాత్మకంగా పరిశీలించి చూస్తున్నారు. ఒకవేళ ఇది సత్ఫలితాలు ఇచ్చినట్లయితే ఇటువంటి కొత్త సిగ్నలింగ్ వ్యవస్థలను నగరంలో మరికొన్ని చోట్ల అమరుస్తారు. దీనికి సంబందించిన వీడియోను హైదరాబాద్‌ నగర కమీషనర్ అంజనీకుమార్ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ కొత్త వ్యవస్థ ఏవిధంగా ఉందో మీరూ ఓ లుక్ వేసి అభిప్రాయం చెప్పండి.