జూలై 14 తరువాత మున్సిపల్ ఎన్నికలు

ఈనెల 14వ తేదీ తరువాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి పురపాలక శాఖ, ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించాయి. షెడ్యూల్ ప్రకారం వార్డుల విభజన ప్రక్రియ ఆదివారం నుంచే ప్రారంభం అయింది. ఈనెల 7లోగా రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జనాభా ప్రతిపాదికన వార్డులను ఖరారు చేసి, 8నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా ఓటర్ల జాబితాల తయారీ, వాటిపై అభ్యంతరాల స్వీకరణ, తుది జాబితా ప్రకటన, పోలింగ్ బూత్‌ల ఏర్పాటు మొదలైనా పనులు మొదలుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూలై12వ తేదీలోగా ఈ పనులు పూర్తిచేసి 14వ తేదీలోగా వార్డు మెంబర్లు, మున్సిపల్ చైర్ పర్సన్, మేయర్ల రిజర్వేషన్లను ఖరారు చేయాలని పురపాలక శాఖ నిర్ణయించింది. త్వరలోనే ఈ షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయాలని నిర్ణయించింది. దీనిని బట్టి ఎన్నికల సంఘం త్వరలోనే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.