మహారాష్ట్రలో గోడకూలి 17 మంది మృతి

మహారాష్ట్రలోని పూణేలోని కుంద్వా అనే ప్రాంతంలో విషాదం చోటు చేసుకొంది. గత రెండు రోజులుగా కురుస్తున భారీ వర్షాల ధాటికి ఒక అపార్ట్ మెంట్ గోడకూలి 17 మంది కూలీలు మృతి చెందారు. అపార్ట్ మెంట్ లో నిర్మాణపనులు చేస్తున్న కూలీలు ఆ భవనం గోడనానుకొని రేకులషెడ్‌ వేసుకుని దానిలో ఉంటున్నారు. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆ గోడ కూలి  రేకులషెడ్‌పై పడటంతో దానిలో నిద్రిస్తున్న 17మంది చనిపోయారు. వారిలో నలుగురు చిన్నారులు, కొందరు మహిళలు ఉన్నారు. మృతులందరూ బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందినవారే. శిధిలాల క్రింద కార్లు, ద్విచక్రవాహనాలు కూడా చిక్కుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే అక్కడకు చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించాయి.