.jpg)
తెరాస పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో గురువారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సిఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈసారి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ చురుకుగా పాల్గొని కోటిమందిని పార్టీలో చేర్చుకునే లక్ష్యంగా పనిచేయాలని సిఎం కేసీఆర్ కోరారు. అనంతరం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై చర్చ జరిగింది. జూలై నెలాఖరులోగానే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తి చేద్దామని కేసీఆర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికలు కూడా పూర్తయితే ఇక మిగిలిన నాలుగున్నరేళ్ళు పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయవచ్చునని సిఎం కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తిచేసి పొలాలకు నీళ్ళు అందించబోతున్నందున ఇకపై పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకం నిర్మాణపనులపై దృష్టి పెడతానని సిఎం కేసీఆర్ అన్నారు.