రేపే ఆ శుభదినం...

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రధాన కారణాలలో ఒకటి సాగునీటి సమస్యలు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సగం సమస్యలు తీరనున్నాయి. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, దేవాదుల ప్రాజెక్టులు కూడా పూర్తయితే రాష్ట్రంలో నీటి సమస్యలు శాస్వితంగా పరిష్కారం అవుతాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానభాగం పనులు పూర్తవడంతో గవర్నర్‌ నరసింహన్‌ చేతుల మీదుగా శుక్రవారం దానిని ప్రారంభోత్సవం జరుగనుంది. సిఎం కేసీఆర్‌ చెప్పిన బంగారి తెలంగాణ సాధనలో మొదటిదశ పూర్తయినట్లే చెప్పవచ్చు. కనుక కాళేశ్వరం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రంలో పల్లెపల్లెలో... ఊరూవాడా సంబురాలు జరుపుకోవాలని సిఎం కేసీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.      

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 11 జిల్లాలలో 19 బ్యారేజీలు, జలాశయాలు నిర్మిస్తున్నారు. వాటి నుంచి మళ్ళీ నీటిని ఎత్తిపోసేందుకు పంప్‌హౌస్‌ల నిర్మాణపనులు జోరుగా సాగుతున్నాయి. వాటి వివరాలు:   

      జిల్లా

ప్రతిపాదిత జలాశయాలు, బ్యారేజీలు       సామర్ధ్యం    (టీఎంసీలలో)

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవ్ పూర్ మండలం, మేడిగడ్డ గ్రామం

మేడిగడ్డ బ్యారేజి

16.17

జయశంకర్ భూపాలపల్లి, మహదేవ్ పూర్ మండలం, అన్నారం గ్రామం

అన్నారం

10.87

పెద్దపల్లి జిల్లా, కమాన్ పూర్ మండలం, సుందిళ్ళ గ్రామం

సుందిళ్ళ

8.83

కరీంనగర్‌, మేడారం

మేడారం

0.78

కరీంనగర్‌ జిల్లా, ఇల్లంతుకుంట,  అనంతగిరి

అనంతగిరి

3.50

సిద్ధిపేట జిల్లా, చిన్నకోడూర్ మండలం, చంద్లాపూర్ గ్రామం

రంగనాయక సాగర్

3.00

మెదక్ జిల్లా

మల్లన్నసాగర్

50.00

రాజన్న సిరిసిల్లా జిల్లా

మలక్ పేట

3.00

మెదక్ జిల్లా

కొండ పోచమ్మ సాగర్

15.00

నల్గొండ జిల్లా, ఎం.తుర్కపల్లి మండలం, గండమల్ల గ్రామం  

గంధమల్ల

9.87

యాదాద్రి భువనగిరి జిల్లా, భోన్ గిరి మండలం, బస్వాపూరమ్ గ్రామం

బస్వాపురం

11.39

కామారెడ్డి జిల్లా

భూంపల్లి

0.09

నిజామాబాద్ జిల్లా

కొండెం చెరువు

3.50

మెదక్ జిల్లా

తిమ్మక్కపల్లి

1.50

అదిలాబాద్ జిల్లా

దంతెపల్లి

1.00

అదిలాబాద్ జిల్లా

ధర్మారావు పేట

.050

కామారెడ్డి జిల్లా

ముద్దిజివాడి

0.50

కామారెడ్డి జిల్లా

కాటేవాడి

0.50

నిజామాబాద్ జిల్లా, వేల్పూర్ మండలం, మోతె గ్రామం

మోతె

1.00

 

మొత్తం

141.00