త్వరలో కొత్త సచివాలయానికి శంఖుస్థాపన

సచివాలయంలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియ మొదలవడంతో పాత సచివాలయం స్థానంలో కొత్త సచివాలయ భవన నిర్మాణానికి ఈనెల 27న సిఎం కేసీఆర్‌ శంఖుస్థాపన చేయడానికి ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. తొలుత సికిందరాబాద్‌లోని బైసన్ పోలో మైదానంలో రాజమహల్‌ను తలపించేవిధంగా సచివాలయాన్ని నిర్మించాలనుకున్నారు. కానీ రక్షణశాఖ ఆ భూములను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించకపోవడంతో సచివాలయ నిర్మాణ ప్రతిపాదన అలాగే ఉండిపోయింది. ఇప్పుడు పాత సచివాలయ భవనాలన్నీ తెలంగాణ ప్రభుత్వ అధీనంలోకి వస్తున్నందున ఇక కొత్త సచివాలయ భవన నిర్మాణ పనులు ప్రారంభించడానికి ఎటువంటి అవరోధాలు ఉండకపోవచ్చు.