
ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి తన మంత్రివర్గంలో మంత్రుల పేర్లను, స్పీకర్ పేరును ఖరారు చేశారు. అయితే పార్టీ సీనియర్ నేత, జగన్ తరపున చంద్రబాబునాయుడుపై నిత్యం విరుచుకుపడే నగరి ఎమ్మెల్యే రోజాకు మంత్రివర్గంలో స్థానం లభించకపోవడం ఆమెకు పెద్ద షాక్. పార్టీ ఎమ్మెల్యేలలో ఖచ్చితంగా మంత్రి పదవి లభించేవారిలో రోజా పేరు ప్రధానంగా ఉండేది. కానీ జగన్ ఎందుకో ఆమెను పక్కన పెట్టారు. దీనిపై రోజా ఇంకా స్పందించవలసి ఉంది.
ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా పార్టీలో సీనియర్ నేతలు తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి ఎంపికయ్యారు.
జగన్ మంత్రివర్గంలో స్థానం లభించిన మంత్రుల పేర్లు:
బొత్స సత్యనారాయణ (విజయనగరం)
పాముల పుష్ప శ్రీవాణి (విజయనగరం)
పిల్లి సుభాష్‌చంద్రబోస్ (తూర్పుగోదావరి)
కొడాలి నాని (కృష్ణా)
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (కర్నూలు)
బాలినేని శ్రీనివాస్‌రెడ్డి (ప్రకాశం)
ధర్మాన కృష్ణదాస్ (శ్రీకాకుళం)
అవంతి శ్రీనివాస్ (విశాఖ)
కురసాల కన్నబాబు (తూర్పుగోదావరి)
పినిపె విశ్వరూప్ (తూర్పుగోదావరి)
వెల్లంపల్లి శ్రీనివాస్ (కృష్ణా)
పేర్ని నాని (కృష్ణా జిల్లా)
ఆళ్ల రామకృష్ణారెడ్డి (గుంటూరు)
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (చిత్తూరు)
మేకపాటి గౌతమ్ రెడ్డి (నెల్లూరు)
ఆళ్ల నాని (పశ్చిమ గోదావరి)
మోపిదేవి వెంకటరమణ (గుంటూరు)
అంజాద్ బాషా (కడప)
చెరుకువాడ శ్రీరంగనాథ రాజు (పశ్చిమ గోదావరి)
తానేటి వనిత (పశ్చిమ గోదావరి)
మేకతోటి సుచరిత (గుంటూరు)
గుమ్మనూరు జయరాం (కర్నూలు)
నారాయణస్వామి (చిత్తూరు)
శంకర్‌నారాయణ (అనంతపురం)
అనిల్‌కుమార్ యాదవ్ (నెల్లూరు)