
రేపు మండల పరిషత్, ఎల్లుండి జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలు జరుగనున్నాయి. కనుక ఆ రెండు పదవులకు తెరాసలో గట్టి పోటీ నెలకొని ఉంది. ఖమ్మం జిల్లా ఎంపీపీ, జెడ్పీ సభ్యుల పదవీకాలం ఇంకా ఆగస్ట్ వరకు ఉంది. కానీ అన్ని జిల్లాల కంటే ముందుగా ఖమ్మం జిల్లా జెడ్పీ చైర్మన్ పదవికి లింగాల కమల్ రాజు పేరును తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖరారు చేసినట్లు తాజా సమాచారం. రేపటిలోగా మిగిలిన జిల్లాలకు జెడ్పీ, ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు పేర్లు ఖరారు అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఏ కారణం చేతైనా అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు రేపు, ఎల్లుండిలోగా పూర్తికాకపోతే మళ్ళీ ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసుకొని ఎన్నికలు నిర్వహించుకొనేందుకు ఎన్నికల సంఘం అనుమతి పొందవలసి ఉంటుంది.