మహారాష్ట్రలో టిఎస్ఆర్టీసీ బస్సు దగ్దం

మహారాష్ట్రలో టిఎస్ఆర్టీసీ బస్సు మంటలలో దగ్దమైంది. శుక్రవారం ఉదయం మహారాష్ట్రలోని పండరీపూర్ నుంచి హైదరాబాద్‌ తిరిగి వస్తుండగా షోలాపూర్ వద్ద ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలయినట్లు తెలుస్తోంది. ప్రాణనష్టం జరిగిందా లేదా అనే విషయం ఇంకా తెలియవలసి ఉంది. బ్యాటరీలను తీసుకువెళుతున్న లారీని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి డ్డీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. స్థానికుల సహాయంతో పోలీసులు క్షతగాత్రులను షోలాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబందించి పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.