
నవీన్ పట్నాయక్ ఈరోజు ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది 5వ సారి. భారత్‌లో ఇప్పటి వరకు ఇటువంటి గొప్ప రికార్డు ఇద్దరికే ఉంది. ఒకరు దివంగత పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతీ బసు...మరొకరు సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చమ్లాంగ్. ఇప్పుడు నవీన్ పట్నాయక్ కూడా ఆ జాబితాలోకెక్కారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఒడిశాలోని 147 స్థానాలలో బిజేడి 112 సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారం చేజిక్కించుకొంది. బిజెపి 23, కాంగ్రెస్ 9 స్థానాలను గెలుచుకొన్నాయి. లోక్‌సభ 21 స్థానాలలో 12 గెలుచుకొంది.
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయనతోపాటు 20 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. విశేషమేమిటంటే, వారిలో 9మందిని సహాయమంత్రులున్నారు. నవీన్ మంత్రివర్గంలో 10 మంది కొత్తవారు కావడం మరో విశేషం.