
ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎం చంద్రబాబునాయుడుకి కాబోయే సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ్ళ ఫోన్ చేశారు! ఈనెల 30 మధ్యాహ్నం 12.23 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగబోయే తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావలసిందిగా ఆహ్వానించారు. జగన్ ఆహ్వానంపై చంద్రబాబునాయుడు ఏవిధంగా స్పందించారో ఇంకా తెలియవలసి ఉంది.
తెలంగాణ సిఎం కేసీఆర్‌ను కూడా జగన్ ఆహ్వానించారు. జగన్ ఆహ్వానాన్ని మన్నించి సిఎం కేసీఆర్ ఈనెల 29 రాత్రికే విజయవాడ చేరుకోనున్నారు. రాత్రి అక్కడే బస చేసి మరుసటిరోజు ఉదయం కనకదుర్గ అమ్మవారిని సందర్శించుకొంటారు. అక్కడి నుంచి నేరుగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చేరుకొని జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత ఆయన మళ్ళీ హైదరాబాద్ తిరిగివెళ్లిపోతారా లేక జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్ నరసింహన్‌లతో కలిసి ప్రత్యేకవిమానంలో డిల్లీ వెళ్ళి అక్కడ నరేంద్రమోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవుతారా? అనే విషయం ఇంకా తెలియవలసి ఉంది. నరేంద్రమోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి చంద్రబాబునాయుడుకు ఆహ్వానం అందిందా లేదా? అనే విషయం తెలియదు కానీ అందితే దానికి ఆయన హాజరుకాకపోవచ్చు.