.jpg)
తెలంగాణ రాష్ట్రంలో పింఛనుదారులకు శుభవార్త. రాష్ట్రంలో తమ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఇస్తున్న ఆసరా పింఛనులను రెట్టింపు చేస్తామని సిఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం జూన్ 1వ తేదీ నుంచి ఆసరా పింఛనులను రెట్టింపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, గీత కార్మికులు, బోధకాలు, హెచ్.ఐ.వి, వ్యాధిగ్రస్తులకు ఇక నుంచి నెలకు రూ.2016 పింఛను లభిస్తుంది. వికలాంగులకు నెలకు రూ.3,016 లభిస్తుంది. పెరిగిన ఈ పింఛనులు జూలై 1వ తేదీ నుంచి లబ్దిదారుల చేతికి అందుతుంది. వీటి వలన రాష్ట్రంలో సుమారు 46 లక్షల మందికి పైగా లబ్ధి పొందనున్నారు. ఇది నిరంతరామ్గా కొనసాగే పధకం కనుక అర్హులైనవారు ఎప్పుడైనా పింఛను కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.