ఏపీలో వైసీపీకే ఆధిక్యత

సమయం: 9.23 గంటలు 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రధానంగా టిడిపి, వైసీపీల మద్యనే పోటీ నెలకొంది. ఇప్పటి వరకు లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైసీపీ 57 స్థానాలలో, టిడిపి 17 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతున్నాయి. కానీ లోక్‌సభ స్థానాలలో టిడిపి, వైసీపీ రెండూ చెరో 5 స్థానాలలో ముందంజలో ఉన్నాయి.  

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి శాసనసభకు పోటీ చేసిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌ వెనుకబడి ఉన్నారు. మంగళగిరి నుంచి శాసనసభకు పోటీ చేసిన నారా లోకేష్‌ ముందంజలో ఉన్నారు. 

ఖమ్మం నుంచి లోక్‌సభకు పోటీ చేసిన తెరాస అభ్యర్ధి నామా నాగేశ్వరరావు మొదటి రౌండ్ లెక్కింపు ముగిసేసరికి 3159 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. అమెథీలో రాహుల్ గాంధీ వెనుకబడ్డారు. అక్కడ బిజెపి అభ్యర్ది స్మృతి ఇరానీ ముందంజలో ఉన్నారు.