
ఆదివారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో తమిళనాడులో డిఎంకె-కాంగ్రెస్ కూటమి ఘనవిజయం సాధించబోతోందని దాదాపు అన్ని సర్వే సంస్థలు జోస్యం చెప్పాయి. రాష్ట్రంలో గల 38 లోక్‌సభ స్థానాలలో డిఎంకె-కాంగ్రెస్ కూటమి మెజార్టీ సీట్లు గెలుచుకోబోతోందని సర్వేలు సూచిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటు 18 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరిగాయి. వాటిలో కూడా డిఎంకె-కాంగ్రెస్ కూటమి విజయం సాధించబోతోందని సర్వేలు స్పష్టం చేశాయి. తమిళనాడులోని 38 లోక్‌సభ స్థానాలలో ఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయంటే...
|
|
అన్నాడిఎంకె+బిజెపి |
డిఎంకె+కాంగ్రెస్ |
ఇతరులు |
|
ఇండియా టుడే |
4 |
34 |
- |
|
టైమ్స్ నౌ |
9 |
29 |
- |
|
న్యూస్ ఎక్స్ |
- |
34-38 |
- |
|
చాణక్య-న్యూస్ 24 |
6 |
31 |
- |
|
రిపబ్లిక్-సీ ఓటర్ |
11 |
27 |
- |
ఈ సర్వే ఫలితాలు కమల్ హాసన్‌కు పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. ఆయన సుమారు ఏడాది క్రిందట సినిమాలు విడిచిపెట్టి ‘మక్కల్ నీది మయ్యమ్’ (ఎంఎన్ఎం)అనే పార్టీని స్థాపించి ప్రత్యక్షరాజకీయాలలోకి ప్రవేశించి ఈ ఎన్నికలలో పోటీ చేశారు. కానీ ఏ సర్వేలోను ఆయన పార్టీకి ఒక్క సీటైనా వస్తుందని చెప్పలేదు. కానీ తమిళనాడులో పేద, ఉన్నతవర్గాలలో కమల్ హాసన్‌కు చాలా మంది అభిమానులున్నారు. గత ఏడాదికి పైగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఆయన వారందరికీ మరిన్త్ చేరువయ్యే ఉంటారు కనుక ఎంఎన్ఎం పార్టీకి గౌరవప్రదమైన సీట్లు లభించే అవకాశం ఉందనే భావించవచ్చు. గత రెండు దశాబ్ధాలుగా ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తానని చెపుతూ ఊరిస్తున్న ఆయన సాటి నటుడు రజనీకాంత్ ఏ నిర్ణయం తీసుకోకుండా కాలక్షేపం చేయడం మంచిదైందని చెప్పవచ్చు. ఒకవేళ ఎంఎన్ఎం పార్టీ ఒక్క సీటు కూడా రాకుండా ఘోరంగా ఓడిపోతే, ఇక రజనీకాంత్ రాజకీయ ప్రవేశం ఆలోచన విరమించుకొన్నా ఆశ్చర్యం లేదు.