
జాతీయస్థాయిలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సర్వే సంస్థలన్నీ మళ్ళీ బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమే పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేయగలిగాయి. కానీ ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం విశేషం.
లగడపాటి, ఐఎన్ఎస్ఎస్ సంస్థలు మళ్ళీ టిడిపి పూర్తి మెజార్టీలో రాష్ట్రంలో అధికారంలోకి రాబోతోందని చెప్పగా, నాలుగు సంస్థలు వైకాపా స్పష్టమైన మెజారిటీతో గెలువబోతోందని జోస్యం చెప్పాయి. అంటే అయితే టిడిపి లేదా వైకాపా పూర్తి మెజారిటీతోనే అధికారంలోకి వస్తాయని చెప్పాయి తప్ప హంగ్ ఏర్పడుతుందని చెప్పకపోవడం విశేషం. ఈసారి ఏపీలో జగన్ ప్రభంజనం వీచినప్పటికీ టిడిపి, వైకాపాల మద్య హోరాహోరీగా జరిగినపోరు కారణంగా రెంటిలో ఏది గెలిచినా బొటాబోటీ మెజార్టీతో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ సర్వే సంస్థలు చెప్పినట్లు హంగ్ ఏర్పడకుండా టిడిపి, వైసీపీలలో ఏది పూర్తి మెజార్టీతో గెలిచినా ఏపీ ప్రజలకు చాలా ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వివిద సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్:
|
|
టిడిపి |
వైసీపీ |
జనసేన |
కాంగ్రెస్ |
బిజెపి |
ఇతరులు |
|
ఇండియా టుడే |
37-40 |
130-135 |
0-1 |
0 |
0 |
0 |
|
సీఎన్ఎస్ సర్వే |
43-44 |
130-133 |
0-1 |
0 |
0 |
0 |
|
విడిపీ అసోసియేట్స్ |
54-60 |
130-133 |
0-4 |
0 |
0 |
0 |
|
ఆరా సర్వే |
47 |
126 |
2 |
- |
- |
- |
|
లగడపాటి సర్వే |
90-110 |
65-79 |
0 |
0 |
0 |
1-5 |
|
ఐఎన్ఎస్ఎస్ |
118 |
52 |
5 |
0 |
0 |
0 |
|
|
టిడిపి |
వైసీపీ |
జనసేన |
కాంగ్రెస్ |
బిజెపి |
ఇతరులు |
|
టుడేస్ చాణక్య |
14-20 |
5-11 |
0 |
0 |
0 |
0 |
|
సీ-ఓటర్ |
14 |
11 |
0 |
0 |
0 |
0 |
|
లగడపాటి |
13-17 |
8-12 |
0 |
0 |
0 |
0-1 |
|
న్యూస్ 18 |
10-12 |
13-14 |
0 |
0 |
0-1 |
0 |
|
ఐఎన్ఎస్ఎస్ |
17 |
7 |
1 |
0 |
0 |
0 |
|
ఇండియా టుడే |
4-6 |
18-20 |
0 |
0-1 |
0-1 |
0 |