హనుమంతన్న దెబ్బకు నగేశ్ ఔట్

మొన్న శనివారం ఇందిరా పార్కులో అఖిలపక్ష ధర్నాలో కాంగ్రెస్‌ నేతలు వి.హనుమంతరావు, నగేశ్ ముదిరాజ్ కుర్చీ కోసం దాదాపు కొట్టుకొన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ ఘటనపై నేడు గాంధీభవన్‌లో క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ కోదండరెడ్డి అధ్యక్షతన విచారణ జరిగినప్పుడు, ఇరువురూ తమ తమవాదనలు వినిపించారు. పార్టీలో అందరి కంటే సీనియర్ నేత అయిన వి.హనుమంతరావుపై బహిరంగంగా దాడి చేసి పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు నాగేశ్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కోదండరెడ్డి ప్రకటించారు.