
కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్దుల పేర్లను ప్రకటించింది. స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు వరంగల్ నుంచి ఇంగుల వెంకట్రామిరెడ్డి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య కోమటిరెడ్డి లక్ష్మీ రెడ్డి, రంగారెడ్డి నుంచి ఉదయ్ మోహన్ రెడ్డిలను కాంగ్రెస్ అభ్యర్దులుగా ప్రకటించింది. ఇంకా బిజెపి, వామపక్షాలు తమ అభ్యర్దులను ప్రకటించవలసి ఉంది. నామినేషన్లు వేసేందుకు గడువు రేపాటితో ముగుస్తుంది కనుక రేపటిలోగా అవి కూడా తమ అభ్యర్దులను ప్రకటించే అవకాశం ఉంది.
తెరాస అభ్యర్ధులుగా వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ నుంచి తేరా చిన్నప్ప రెడ్డి, రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్ రెడ్డి, పోటీ చేస్తున్నారు.