
రాష్ట్రంలో మొత్తం 3 దశలలో సాగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో మొదటిదశ ఇప్పటికే పూర్తికాగా నేడు 2వ దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ దశలో మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా మినహా మిగిలిన 31 జిల్లాలలో మొత్తం 179 జడ్పీటీసీ, 1913 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా వాటిలో ఒక జెడ్పీటీసీ, 63 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 179 జెడ్పీటీసీ,1850 ఎంపీటీసీ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఎంపీటీసీలకు 6,146 మంది, జెడ్పీటీసీలకు 805 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 4వరకు మిగిలిన చోట్ల సాయంత్రం 5 గంటలవరకు పోలింగ్ జరుగుతుంది.
ఈ నెల 14న 3వ దశ ఎన్నికలు జరుగుతాయి. వాటిలో 161 జడ్పీటీసీ, 1738 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.