ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి ఏదో చేయాలని తాపత్రయపడుతుంటారు కానీ కొందరు అధికారుల నిర్లక్ష్యం, అవినీతి కారణంగా ప్రజలు ప్రభుత్వాన్ని తిట్టుకొనే పరిస్థితులు ఎదురవుతుండటం చాలా బాధాకరం. సరూర్‌నగర్ మండలాఫీసు ఆవరణలోగల ఒక చెత్తకుప్పలో అధికారుల సంతకాలతో ఉన్న ఒరిజినల్ పత్రాలు ఒక మహిళకు లభ్యమయ్యాయి. ఉద్యోగాలు లేదా రేషన్ కార్డులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు లేదా ఇతర అవసరాల కోసం ప్రజలు తగిన ఫీజులు చెల్లించి దరఖాస్తులు చేసుకొంటుంటారు. వాటిని పరిశీలించి ఆమోదించడమో లేక అనర్హమైనవాటిని తిరస్కరించడమో చేయాలి. దరఖాస్తు చేసుకొన్న ప్రజలు వచ్చి అడిగినప్పుడు వారికి సమాధానం చెప్పవలసివస్తే లేదా ఆ తరువాత న్యాయపరమైన సమస్యలు ఎదురైతే ఆ రికార్డులు చాలా అవసరం కనుక ఆ రికార్డులను భద్రంగా ఉంచాలి తప్ప చెత్తకుప్పలో వేయకూడదు. కానీ నిర్లక్ష్యంగా చెత్తకుప్పలో పడేశారు. వాటిని కనుగొన్న మహిళ సదరు దరఖాస్తులలో అభ్యర్ధులతో కలిసి పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని, అవసరమైతే మండలాఫీసు వద్ద ధర్నా చేసి నిరసన తెలియజేస్తామని చెప్పారు. దీనిని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. ఆమె ఏమి చెప్పిందో మీరే స్వయంగా వినండి.