
బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ బుదవారం గవర్నర్ నరసింహన్‌ను కలిసి బొమ్మల రామారం మండలం హాజీపూర్ గ్రామంలో జరిగిన హత్యాచారాలపై విచారణ కొరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. 12 నెలల వ్యవదిలో రాష్ట్రంలో సుమారు 1,000కి పైగా మహిళలు అదృశ్యమయ్యారని అన్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో మహిళా మంత్రి లేకపోవడం వలననే రాష్ట్రంలో మహిళలకు న్యాయం జరుగడంలేదని అన్నారు. హాజీపూర్ లో ముగ్గురు బాలికలను హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష సరైన శిక్ష అని అన్నారు. హాజీపూర్ భాదిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. ఈ హత్యాచారాలపై డిల్లీలో జాతీయ మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేస్తానని అన్నారు.
బండారు దత్తాత్రేయకు సిఎం కేసీఆర్‌తో సత్సంబందాలే ఉన్నాయని అందరికీ తెలుసు కనుక బాధిత కుటుంబాలకు న్యాయం జరుగాలని కోరుకొంటే ఆయన నేరుగా సిఎం కేసీఆర్‌నే కలిసి మాట్లాడి ఉంటే ఫలితం ఉండేది. కానీ గవర్నర్ నరసింహన్‌ను కలిసి మాట్లాడటం రాజకీయ చర్యగానే భావించవలసి ఉంటుంది.