మల్లన్నసాగర్ నిర్వాసితులకు నష్టపరిహారం వేగవంతం

మల్లన్నసాగర్ నిర్వాసితులకు పునరావాసం, నష్టపరిహారం చెల్లింపు, ఉపాది కల్పనపై ఈనెల 11వ తేదీ లోపు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సమగ్ర నివేదిక సమర్పించవలసి ఉన్నందున సిఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రగతి భవన్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ అధికారులకు కొన్ని ఆదేశాలు, ముఖ్య సూచనలు చేశారు. 

1. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపు ప్రక్రియ మొత్తం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి స్వయంగా పర్యవేక్షించాలి.

2. నష్టపరిహారం చెల్లింపుల కోసం గ్రామాలవారీగా శిబిరాలు నిర్వహించాలి. 

3. నిర్వాసితులందరికీ యుద్ధప్రాతిపదికన పునరావాసం కల్పించాలి. 

4. ఆరేడు నెలలోగా మల్లన్న సాగర్ జలాశయం నిర్మాణం పూర్తి చేసి వచ్చే ఏడాది జూన్ లో నీళ్ళు నింపాలి.