మల్లు భట్టివిక్రమార్కకు తీవ్ర అస్వస్థత

కాంగ్రెస్‌ శాసనసభా పక్షనేత మల్లు భట్టివిక్రమార్క తీవ్ర అస్వస్థతకు గురవడంతో బుదవారం ఖమ్మం నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను నిరసిస్తూ ఆయన గత మూడు రోజులుగా ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర పేరిట ఖమ్మం జిల్లాలో మండలాలలో పర్యటిస్తున్నారు. రోజూ ఎండలో తిరగడం వలన ఆయనకు వడ దెబ్బ తగిలిందని వైద్యులు తెలిపారు. వడదెబ్బ కారణంగా ఆయన తీవ్ర జ్వరం, నీరసంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితర కాంగ్రెస్‌ నేతలు ఆయనకు ఫోన్ చేసి ఆరోగ్యపరిస్థితి గురించి అడిగి తెలుకొన్నారు. మరో రెండు మూడు రోజుల తరువాత ఆయనను ఆసుపత్రి నుంచి పంపిస్తారు కానీ మళ్ళీ ఎండలలో తిరిగితే ప్రమాదం కనుక కొన్ని రోజుల పాటు ఇంటికి లేదా గాంధీభవన్‌కే పరిమితం కావచ్చు.