నేటి నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు!

నేటి నుంచి ఈ నెల 31వరకు హైకోర్టుకు వేసవి సెలవులు మొదలవుతాయి. కానీ అత్యవసర కేసులను విచారించేందుకు వెకేషన్ కోర్టులను ఏర్పాటు చేశారు. ఈ నెలరోజులలో అవి రెండుసార్లు పని చేస్తాయి. మొదటి వెకేషన్ కోర్టు మే6, 13 తేదీలలో పిటిషన్లు స్వీకరించి వాటిపై మే 8,15 తేదీలలో విచారణ చేపడుతుంది. ఈ వెకేషన్ కోర్టులో తాత్కాలిక ప్రధానన్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలో న్యాయమూర్తులు జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి పనిచేస్తారు. 

న్యాయమూర్తులు జస్టిస్ ఏ. రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ చల్లా కోదండరాంల కూడిన 2వ వెకేషన్ కోర్టు మే 20,27 తేదీలలో పిటిషన్లు స్వీకరించి వాటిపై 22,29 తేదీలలో విచారణ చేపడుతుంది. ఈ రెండు వెకేషన్ కోర్టులు రోజువారి కేసులను చేపట్టవు. కేవలం అత్యవసరకేసులను మాత్రమే విచారణకు స్వీకరిస్తాయి.