
తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డులో జరిగిన అవకతవకలను నిరసిస్తూ కాంగ్రెస్, టిడిపి, టిజేఎస్, సిపిఐ, సిపిఎం పార్టీలు నేడు ‘చలో ఇంటర్మీడియెట్ బోర్డు’ పేరిట నాంపల్లిలోని బోర్డు కార్యాలయం వద్ద ఆందోళన చేయనున్నాయి. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టిజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, సిపిఐ కార్యదర్శి చాడా వెంకటరమణ, సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆయా పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొనున్నారు. జనసేన పార్టీ వారి ఆందోళనకు మద్దతు ప్రకటించింది. ఆత్మహత్యలు చేసుకొన్న ఇంటర్ విద్యార్దుల కుటుంబాలను అఖిలపక్ష నేతలు ఆదివారం పరామర్శించి వారికి న్యాయం జరిగేవరకు పోరాడుతామని హామీ ఇచ్చారు. మరోపక్క అన్ని జిల్లాలలో కలెక్టరేట్ కార్యాలయాలను ముట్టడించి నిరసనలు తెలియజేస్తామని సిపిఐ, సిపిఎం పార్టీలు తెలిపాయి.