
అవును...ఆర్టీసీ బస్సునే…దొంగలు ఎత్తుకుపోయారు. కుషాయిగూడ డిపోకూ చెందిన ఆర్టీసీ బస్సును డ్రైవరు బుదవారం రాత్రి గౌలిగూడా బస్ స్టాప్ వద్ద నైట్ హాల్ట్ కోసం నిలిపి డ్యూటీ దిగి వెళ్లిపోయాడు. మళ్ళీ ఉదయం వచ్చి చూసేసరికి అక్కడ బస్సు లేదు. అతను వెంటనే డిపో అధికారికి సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి పరిసర ప్రాంతాలలో ఉన్న సిసి కెమెరాలలో రికార్డ్ అయిన దృశ్యాలను పరిశీలించగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి 11 గంటలకు బస్సును తీసుకొని తూప్రాన్ వైపు వెళ్ళినట్లు గుర్తించారు. పోలీసులు ఇప్పుడు తూప్రాన్ పరిసర ప్రాంతాలలో సిసి కెమెరాలలో దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇది మామూలు దొంగతనమే అయితే పరువాలేదు కానీ ఉగ్రవాదులు లేదా వారి సానుభూతిపరులెవరైనా బస్సును దొంగిలించి ఉంటే చాలా ప్రమాదకరమైన విషయమే. పోలీసులు కేసీఆర్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.