సిఎం కేసీఆర్‌కు ఈసీ నోటీస్

సిఎం కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం బుదవారం నోటీసు పంపింది. మార్చి 17న కరీంనగర్‌ బహిరంగసభలో కేసీఆర్‌ ప్రసంగిస్తూ హిందువులను కించపరుస్తున్నట్లు మాట్లాడి వారి మనోభావాలను దెబ్బ తీశారని, ఎన్నికల నియమావళికి విరుద్దంగా మాట్లాడినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రామరాజు అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సిఎం కేసీఆర్‌ను సంజాయిషీ కోరుతూ నోటీస్ పంపించింది. సంజాయిషీ ఇచ్చేందుకు ఆయనకు రెండు రోజులు గడువు ఇచ్చింది.