ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ ఏడాది జనవరిలో హైకోర్టు విభజన జరిగి ఏపీలో హైకోర్టు ఏర్పాటైన తరువాత జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ తాత్కాలిక ప్రధానన్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇప్పుడు ఆయన స్థానంలో అలహాబాద్ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ విక్రమ్‌నాథ్‌ పేరును సుప్రీంకోర్టు కొలీజియమ్ బుదవారం ఖరారు చేసింది. ఆయన పదవీ కాలం 2024, సెప్టెంబర్ 23 వరకు ఉంది.