
లోక్‌సభ ఎన్నికల కోసం తెరాస 20 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఈనెల 23వ తేదీన కేంద్ర ఎన్నికల కమీషనర్‌కు సమర్పించింది. ఆ జాబితాలో సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు పేరు లేకపోవడంతో కేసీఆర్ ఆయనను పక్కన పెట్టారంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలలు మళ్ళీ వాటిపై మీడియాలో విశ్లేషణలు మొదలయ్యాయి.
తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ‘హరీష్‌రావును పక్కన పెట్టరా?’ అనే ప్రశ్న ఎదురైంది. 20మంది జాబితాలో హరీష్‌రావు వంటి సీనియర్ నేత పేరు ఎందుకు చేర్చలేదో తెలియదు కానీ దీనిపై మీడియాలో ఊహాగానాలు మొదలవడంతో ఆ జాబితాలో తెరాస ప్రధానకార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ స్థానంలో హరీష్‌రావు పేరును చేర్చవలసిందిగా కోరుతూ తెరాస సోమవారం కేంద్ర ఎన్నికల కమీషనర్‌ను కోరింది. హరీష్‌రావును తెరాస స్టార్ క్యాంపెయినర్‌గా గుర్తించాలని కోరింది.
కానీ జరిగిన ఈ పొరపాటు వలన తెరాస అధిష్టానం హరీష్‌రావు ప్రాధాన్యతను క్రమంగా తగ్గించే ప్రయత్నాలు చేస్తోందనే భావన ప్రజలకు కలిగేలా చేసింది. కానీ హరీష్‌రావు దీనిపై స్పందించకుండా తనకు అప్పగించిన పని చేసుకుపోతూ హుందాగా వ్యవహరిస్తున్నారు.