వైసీపీలో చేరిన అలీ

ప్రముఖ హాస్యనటుడు అలీ సోమవారం ఉదయం వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ నివాసంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. ఏప్రిల్ 11న జరుగబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో అలీ పోటీ చేయాలని భావిస్తున్నారు. అందుకోసం ఆయన ఇంతకు ముందు ఏపీ సిఎం చంద్రబాబునాయుడును కలిశారు కానీ టికెట్ కు హామీ లభించకపోవడంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిశారు. కనుక టికెట్ ఇస్తామని జగన్ హామీ ఇచ్చినందునే అలీ వైసీపీలో చేరి ఉండవచ్చు. అలీ తన స్వస్థలం రాజమండ్రి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఇదివరకే ఆ పార్టీలో చేరిన నటుడు కృష్ణుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల కాలంలో ప్రముఖ నటులు జయసుధ, పృధ్వీరాజ్ వైసీపీలో చేరారు. నటుడు అక్కినేని నాగార్జున కూడా లోటస్ పాండ్ కు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిశారు కానీ పార్టీలో చేరలేదు.