115 మంది టిడిపి అభ్యర్ధులను ప్రకటించిన చంద్రబాబు

ఏప్రిల్ 11న జరుగబోయే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 115మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించారు. ఇంకా మరో 60 మంది పేర్లను ఖరారు చేయవలసి ఉంది. ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడినందున సోమవారం సాయంత్రంలోగా మరో 30మంది పేర్లను ఖరారు చేయనున్నట్లు సమాచారం. 

టిడిపి తరపున శాసనసభకు పోటీ చేయబోతున ముఖ్య అభ్యర్ధుల వివరాలు: 

చిత్తూరు జిల్లా: నారా చంద్రబాబునాయుడు (కుప్పం), పులవర్తి నాని (చంద్రగిరి), అమర్ నాధ్ రెడ్డి (పలమనేరు), నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి (పీలేరు).             

కృష్ణా జిల్లా: బోండా ఉమా (విజయవాడ సెంట్రల్), దేవినేని ఉమా(మైలవరం), వల్లభనేని వంశీ (గన్నవరం), కొల్లు రవీంద్ర(బందరు), దేవినేని అవినాష్ (గుడివాడ), మండలి బుద్ధ ప్రసాద్ (అవనిగడ్డ). 

తూర్పు గోదావరి జిల్లా: యనమల రామకృష్ణుడు (తుని), జ్యోతుల నెహ్రూ(జగ్గంపేట), తోట త్రిమూర్తులు (రామచంద్రాపురం).  

పశ్చిమ గోదావరి జిల్లా: పితాని నాని (ఆచంట), చినతామనేని ప్రభాకర్ (దెందలూరు).  

గుంటూరు జిల్లా: నక్కా ఆనందబాబు (వేమూరు), కోడెల శివప్రసాద్ (సత్తెనపల్లి), పత్తిపాటి పుల్లారావు (చిలకలూరిపేట), ఆలపాటి రాజా (తెనాలి), దూళిపాళ నరేంద్ర (పొన్నూరు). 

కడప జిల్లా: సతీష్ రెడ్డి (పులివెందుల), రామసుబ్బారెడ్డి (జమ్మల మడుగు), పి.నర్సింహారెడ్డి (కమలాపురం).  కర్నూలు జిల్లా: అఖిలప్రియ (ఆళ్లగడ్డ), భూమా బ్రహ్మానందరెడ్డి (నంద్యాల).  

నెల్లూరు జిల్లా: నారాయణ (నెల్లూరు అర్బన్), ఆదాల ప్రభాకర్ రెడ్డి (నెల్లూరు రూరల్), సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (సర్వేపల్లి), బీద మస్తాన్ రావ్ (కావాలి), పాశం సునీల్ (గూడూరు).  

అనంతపురం జిల్లా: నందమూరి బాలకృష్ణ (హిందూపురం), పరిటాల సునీత (రాప్తాడు), కాల్వ శ్రీనివాసులు (రాయదుర్గం), పల్లె రఘునాధ రెడ్డి (పుటపర్తి), పయ్యావుల కేశవ (ఉరవకొండ). 

శ్రీకాకుళం జిల్లా: అచ్చెన్నాయుడు(టెక్కలి), కళా వెంకట్రావు (ఎచ్చెర్ల).

విజయనగర జిల్లా: సుజయ్ కృష్ణ రంగారావు (బొబ్బిలి).

విశాఖ జిల్లా: బండారు సత్యనారాయణ (పెందుర్తి), 

ప్రకాశం జిల్లా: గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి), కారణం బలరాం (చీరాల).