
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతరావు తెరాసలో చేరేందుకు సిద్దం అయిన సంగతి తెలిసిందే. తెరాసలో చేరే ముందు తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆత్రం సక్కు ఇదివరకే ప్రకటించారు. తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే తెరాసలో చేరుతానని రేగా కాంతారావు ఈరోజు ప్రకటించారు. 2014 ఎన్నికల తరువాత కాంగ్రెస్, టిడిపి, వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలలో కొంతమంది తెరాసలో చేరేటప్పుడు ఇలాగే చెప్పారు. కానీ మళ్ళీ ఎన్నికలోచ్చేవరకు ఎవరూ తమ పదవులకు రాజీనామాలు చేయలేదు. కనుక రేగా, ఆత్రం సక్కులు తమ మాటకు కట్టుబడి రాజీనామాలు చేస్తారనుకోలేము. చేస్తే గొప్ప విషయమే. కాంగ్రెస్ నేతలు కూడా హర్షిస్తారు చేయకపోతే విమర్శలు, కోర్టు కేసులు ఎదుర్కోక తప్పదు. వారిరువురితోపాటు నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా తన హస్తం పార్టీకి హ్యాండిచ్చి కారెక్కబోతున్నారు. ఆయన కూడా తన పదవికి రాజీనామా చేస్తానంటారో లేదో? తమ పదవులకు రాజీనామాలు చేస్తే సిఎం కేసీఆర్ మళ్ళీ తమకే కెట్స్ ఇస్తారనే నమ్మకం వారి మాటలలో వినిపిస్తోంది. ఇస్తారో లేదో?ఇవ్వరని అనుమానం కలిగితే రాజీనామా చేస్తారో లేదో?