
వేసవిలో ఎండలు, వర్షాకాలంలో వానలు ఎంత సహజమో ఏడాదికి మూడు నాలుగు మిగ్ యుద్ధ విమానాలు కూలడం...అదృష్టం బాగుంటే పైలట్ ప్రాణాలతో బయటపడటం లేకుంటే విమానంతో పాటు కాలి బూడిదైపోవడం కూడా అంతే సహజమైపోయింది.
రాజస్థాన్‌లోని బికనేర్ సమీపంలోని శోభా సర్కీ ధానీ అనే ప్రాంతంలో శుక్రవారం ఉదయం మిగ్ యుద్ధ విమానం కూలిపోయింది. ఈసారి పైలట్ అదృష్టం బాగుండబట్టి ప్రాణాలతో బయటపడ్డాడు. విమానం కూలడానికి కారణం... ప్రతీసారి వినిపించేదే సాంకేతిక లోపం! తరువాత తంతు కూడా మామూలే...ప్రమాదంపై అధికారులు విచారణకు ఆదేశించారు. ఇక్కడితో ఈ కధ సమాప్తం అయిపోయినట్లే...మళ్ళీ మిగ్ విమానం కూలినప్పుడు సేమ్ స్టోరీ రిపీట్స్. యుద్దంలో శత్రువులతో పోరాడుతూ విమానం కూలితే అది గొప్ప విషయం అవుతుంది. కానీ శిక్షణా సమయంలోనే తెగిన గాలిపటాలలాగా కూలిపోతుంటే వీటిని నమ్ముకొనా మనం పాకిస్థాన్‌తో యుద్ధానికి కాలుదువ్వుతున్నాము? అనే సందేహం కలుగకమానదు.