
త్వరలో జరుగబోయే లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను గురువారం విడుదల చేసింది. తొలి జాబితాలో సోనియా, రాహుల్ గాంధీలతో కలిపి మొత్తం 15 మంది అభ్యర్ధుల పేర్లు ప్రకటించింది. విశేషమేమిటంటే, బిజెపి కంచుకోటగా చెప్పుకోబడుతున్న గుజరాత్, కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ముందుగా అభ్యర్ధులను ప్రకటించింది.
యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ తరచూ అనారోగ్యానికి గురవుతున్న కారణంగా ఈసారి ఎన్నికలకు దూరంగా ఉంటారని భావించినప్పటికీ, రాహుల్ గాంధీ భవిష్యత్తును నిర్దేశించబోయే కీలకమైన ఈ ఎన్నికలలో ప్రతీ ఒక్క సీటు కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యమైనదే కనుక యధాప్రకారం రాయ్ బరేలీ నుంచి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా యధాప్రకారం అమెధీ నుంచి పోటీ చేయనున్నారు. తొలి జాబితాలో ప్రియంకా వాద్రా పేరు లేదు కానీ ఆమె కూడా పోటీ చేసే అవకాశాలున్నాయనే భావించవచ్చు.
కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన తొలి జాబితా ఇదే: