సంఝౌతా నహీ...

భారత్‌-పాక్‌ మద్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పాక్‌ రైల్వే శాఖ ఇరుదేశాల మద్య నడుస్తున్న సంఝౌతా  ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్థాన్‌లో లాహోర్-న్యూడిల్లీ మద్య నడిచే ఈ రైలులో రోజూ వందలాదిమండి భారతీయులు, పాకిస్తాన్ దేశస్థులు ఇరుదేశాలమద్య ప్రయాణిస్తుంటారు. 1947లో భారత్‌-పాక్‌ భౌగోళికంగా విడిపోయినప్పటికీ ఇరుదేశాల ప్రజల మద్య బందుత్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. 1976, జూలై 22న ప్రారంభమయిన ఈ సంఝౌతా  ఎక్స్‌ప్రెస్‌ వారానికి రెండు రోజులు (సోమ, గురువారాలు) నడుస్తుంది. ఈరైలు నిలిపివేయడంతో ఇరుదేశాలలో అనేకమంది ప్రయాణికులు న్యూడిల్లీ, లాహోర్ స్టేషన్లలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరుదేశాల మద్య యుద్దవాతావరణం నెలకొని ఉన్నందున ఈ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇప్పట్లో ప్రారంభమయ్యే సూచనలు కనబడటం లేదు.