కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లు ఖరారు

ఎమ్మెల్యే పట్టభద్రుల కోటాలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసింది. 

ఎమ్మెల్యేల కోటాలో ఒకే ఒక అభ్యర్ధికి అవకాశం ఉన్నందున టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి పేరు ఖరారు చేసింది. నామినేషన్లు వేయడానికి నేటితో గడువు ముగియనుంది కనుక ఆయన ఈరోజు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు.  

ఆదిలాబాద్‌–కరీంనగర్‌–నిజామాబాద్‌–మెదక్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో టి.జీవన్ రెడ్డి పేరు ఖరారు చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆయన జగిత్యాల నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో  ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం మరో అవకాశం కల్పించింది.