బుదవారం ఉదయం భారత్‌లోకి చొచ్చుకు వచ్చిన పాక్ యుద్ధవిమానాలను తరుముతున్నప్పుడు పాక్ చేసిన ఎదురుదాడిలో ఒక మిగ్ విమానం పాక్ సరిహద్దులలో కూలిపోయింది. దాని పైలట్ అభినందన్ వర్ధమాన్ పేరాచూట్ సహాయంతో సురక్షితంగా ఆ ప్రమాదం నుంచి బయటపడినప్పటికీ, అతను పాక్ సైన్యానికి బందీగా చిక్కాడు. అతనిని చిత్రహింసలు పెట్టిన తరువాత అతను తమకు పట్టుబడ్డాడనే విషయం పాక్ ప్రభుత్వం ప్రకటించింది. అతని ఫోటోలు, వీడియో కూడా మీడియాలో ప్రముఖంగా ప్రచురింపబడ్డాయి. భారత్ ప్రభుత్వం మొదట పాక్ మాటలను ఖండించినప్పటికీ ఆ తరువాత అతను పాక్‌కు బందీగా చిక్కాడని అంగీకరించింది. పాక్‌కు బందీగా చిక్కి పాక్ సైనికుల చేతిలో తీవ్రంగా గాయపదినప్పటికీ అభినందన్ వర్ధమాన్ చాలా నిబ్బరంగా మాట్లాడటం చూసి యావత్ భారతీయులు ఆయనకు జేజేలు పలుకుతున్నారు. ఆయన పూర్తి వివరాలు:
పేరు: సింహా కుట్టి అభినందన్ వర్ధమాన్ (వింగ్ కమాండర్)
తండ్రి పేరు: సింహా కుట్టి వర్ధమాన్ (రిటైర్డ్ ఎయిర్ మార్షల్)
స్వస్థలం: తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా తిరుపణవూరు.
విద్యాభ్యాసం: చెన్నైలోని ఉడుమలై పేటలోని సైనిక్ స్కూల్‌లో
ఎయిర్ ఫోర్స్ లో జేరిన తేదీ: 1974, ఫిబ్రవరి 09.
బ్యాడ్జి నెంబర్: 27981
నిర్వహిస్తున్న విధులు: విమాన శిక్షకుడు మరియు టెస్ట్ పైలట్
అనుభవం: 30,000 గంటలకు పైగా విమానాలు నడిపారు.
పాక్ చేతికి బందీగా చిక్కిన అభినందన్ వర్ధమాన్ ను విడిపించుకొనేందుకు భారత్ దౌత్యపరం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కానీ తమకు ఇటువంటి అవమానకర పరిస్థితులను కల్పించి ప్రపంచదేశాల ముందు ధోషిగా నిలబెట్టినందుకు భారత్‌పై చాలా కసితో రగిలిపోతున్న పాక్ అతనిని అంతా తేలికగా విడిచిపెడుతుందని ఆశించడం అత్యాశే అవుతుంది. 40 మంది ఆర్మీ జవాన్లను బలి తీసుకొన్నందుకు పాక్‌పై భారత్ ఏవిధంగా ప్రతీకారం తీర్చుకొందో, తమ సహచరుడిని బందీగా పట్టుకొని చిత్రహింసలు పెడుతున్న పాక్‌పై అదేవిధంగా ప్రతీకారం తీర్చుకొని అభినందన్ వర్ధమాన్ ను పాక్ చెరలో నుంచి విడిపించుకురావాలని వాయుసేన తహతహలాడుతోంది. అతను సురక్షితంగా ప్రాణాలతో బయటపడాలని యావత్ భారతీయులు ప్రార్ధనలు చేస్తున్నారు.