
ఎమ్మెల్యేల కోటాలో జరిగే 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉపాద్యాయులు, పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్రంలో మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ జిల్లాల్లో పట్టభద్రుల నియోజకవర్గాలకు, మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్, వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గాలలో, హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గాలలో ఎన్నికలు జరుగనున్నాయి.
ఎన్నికల షెడ్యూల్ ఈవిధంగా ఉంది:
నోటిఫికేషన్ విడుదల: ఫిబ్రవరి 25, నామినేషన్లకు గడువు: మార్చి 5, నామినేషన్ల పరిశీలన: మార్చి 6, నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 8, పోలింగ్: మార్చి 22వ తేదీ.